LBF News

/ Sep 26, 2025

బొగ్గారపు శరత్‌ చంద్ర ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాలు పంపిణి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకులు బొగ్గారపు శరత్‌ చంద్ర ఆధ్వర్యంలో చైతన్యపురి డివిజన్‌ ఇందిరా నగర్‌ లోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఉచిత పుస్తకాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగాఎంఎల్సి బొగ్గారపు దయానంద్‌ గుప్తా, టిజిఆర్డిసి   చైర్మన్‌ మల్‌ రెడ్డి రాంరెడ్డి హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణి చేశారు. పాఠశాల భవన నిర్మాణం పనులను మధ్యలోనే నిలిపివేశారని ఉపాధ్యాయులు, స్థానిక కాంగ్రెస్‌ నేతలు దయానంద్‌ గుప్తా, రాంరెడ్డి ద్రుష్టికి తీసుకొని వెళ్లగా… ప్రభుత్వం ద్రుష్టికి సమస్యను తీసుకొని వెళ్లి నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చేస్తామని వారు హావిూ ఇచ్చారు. ప్రతి సంవత్సరం 50 వేల   పుస్తకాలు పంపిణి చేస్తున్న శరత్‌ చంద్రను వారు అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు సురేందర్‌ రెడ్డి, శశిదర్‌ రెడ్డి, వెంకటేష్‌ చారి, రవి కేశవ్‌ నాయుడు, చిన్నా గౌడ్‌, చరణ్‌, అరుణ్‌, విజయ రంగ, బంటి తదితరులు పాల్గొన్నారు.