. ఇల్లు దగ్ధం, తలసాని ఆర్థిక సహాయం ప్రకటన
హైదరాబాద్ : సనత్ నగర్లోని రాజరాజేశ్వరి నగర్లో ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలి, భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన ఇంటిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. బాధితులను పరామర్శించిన అనంతరం, వారికి తక్షణ ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.