LBF News

/ Sep 26, 2025

కూటమి ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమం రాష్ట్రంలో అమలు అవుతుంది

. ఎంపీ కేశినేని శివనాథ్‌

కంచికచర్ల :  వైసిపి పాలనలో అథోగతి పాలైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఏడాది కాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు  రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ అన్నారు.  రెండవ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని  ఎంపీ కేశినేని శివనాథ్‌  నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మోడల్‌ కాలనీలో గురువారం నిర్వహించారు. నందిగామ నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్య బోస్‌,  టిడిపి కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు, టిడిపి కంచికచర్ల పట్టణ అధ్యక్షుడు వేమా వెంకటరావు నందిగామ టౌన్‌ పార్టీ అధ్యక్షుడు ఏచూరి రాములతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన  సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.  ప్రతి కుటుంబం ఎంపీ  కేశినేని శివనాథ్‌ కి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వారి ఆనందం వ్యక్తం చేశారు.  మోడల్‌ కాలనీలో వాటర్‌ ట్యాంక్‌ లేక తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బంది ఎంపీ కేశినేని శివనాథ్‌ దృష్టికి రాగా..త్వరలో వాటర్‌ ట్యాంక్‌ నిర్మించి ప్రారంభోత్సవం చేయటానికి వస్తానని కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ ప్రజల సంతృప్తే ముఖ్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ  సంక్షేమ, అభివృద్ది పథకాల  వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా వుందన్నారు.   గత ఏడాది కాలంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్డీయే కూటమి ప్రభుత్వం, ఎన్నో సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.  ఈ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలందరికీ అందుతున్నాయా లేదా, సంక్షేమ పథకాల అమల్లో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు వున్నాయా అనే విషయాలు స్వయంగా పరిశీలించి, ఆ సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించే విధంగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమం రూపొందించారని తెలిపారు. మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి రాగానే రూ.3 వేలుగా పెన్షన్‌ ను వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు అందిస్తున్నామని…దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్‌ అందిస్తున్నారని తెలిపారు.  ఎన్టీఆర్‌ భరోసా కింద దివ్యాంగులకు పెన్షన్‌ రూ.6 వేలు,  పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు అందిస్తూ వారి కళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు ఆనందం నింపుతున్నారన్నారు.