. జిల్లా ఎస్పీ. రావుల గిరిధర్
. ఈవిటీజింగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
షీటీమ్ భరోస సిబ్బంది మహిళల రక్షణ చట్టాల గురించి స్కూల్, కాలేజీలలో అవగాహన కల్పించాలిమహిళలు, పిల్లల రక్షణకు షీటీమ్, భరోస, సిబ్బంది స్నేహిత సమన్వయంతో విధులు నిర్వహించి మహిళల రక్షణకు మేమున్నామని భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ షీటీమ్, భరోసా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సిబ్బందితో 2025 జనవరి 1 నుండి జరిగిన కేసుల పూర్వపరాలు పరిశీలించి బాధితులకు జరిగిన న్యాయం, ముద్దాయిల విూద పెట్టిన కేసులు గురించి రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కేసు మొదటి నుండి చివరి వరకు ప్రతి దశలో మెరుగుపడాల్సిన పరిస్థితి వారికి పోలీసు విభాగం మరియు రెవెన్యూ విభాగం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఆర్థిక సాయం, హెల్త్ చికిత్స అన్ని విధానాల గురించి సవిూక్ష నిర్వహించిన అవగాహన కల్పించారు.
ఈవిటీజింగ్ జరిగే హాట్స్పాట్ వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. షీటీమ్ జిల్లా నెంబర్, మరియు షీటీమ్ సిబ్బంది నెంబర్లు గ్రామాలలో, కాలేజీలు స్కూల్ ల వద్ద పిల్లలకు కనబడే విధంగా చిన్న చిన్న బోర్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా దేవాలయాలు, నల్ల చెరువు, తాళ్ల చెరువు, ప్రజా వైద్యశాల పార్క్, రాజీవ్ పార్క్, ఏకో అర్బన్ పార్క్,, బస్టాండ్ల వద్ద, పాఠశాలలు, కళాశాలల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. భరోసా సెంటర్ సిబ్బంది కూడా తరచుగా షీటీమ్ కార్యక్రమంలో పాల్గొని మైనర్ అమ్మాయిలకు అందిస్తున్న సేవలు గురించి వివరించాలని సూచించారు. ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. మైనర్ అబ్బాయిలు అమ్మాయిలు కనబడితే కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. కౌన్సిలింగ్ నిర్వహించే సమయంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం హాట్స్పాట్ వద్ద విసిబుల్ పోలింగ్ విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డి ఎస్పీ, వెంకటేశ్వరరావు, వనపర్తి సిఐ, కృష్ణయ్య, ఆత్మకూరు సీఐ, శివకుమార్, సెల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఏ హెచ్ టి యు, ఎస్సై, అంజద్, షీటీమ్, ఏ హెచ్ టి యు, భరోసా సెంటర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.