న్యూ డిల్లీ : టిబెటన్ బౌద్ధమత గురువు దలైలామా వారసుడి ఎంపికలో చైనా జోక్యం చేసుకోవడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. మేము ఆమోదించిన వ్యక్తే ఆయన తదుపరి వారసుడిగా ఉంటాడని బీజింగ్ వాదిస్తుండటంపై గురువారం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. చైనా జోక్యాన్ని ఖండిస్తూ టిబెటన్ ఆధ్యాత్మిక సంప్రదాయాలు వారి అంతర్గత విషయమని పేర్కొన్నారు. తన వారసుడు ఎవరని నిర్ణయించుకునే హక్కు కేవలం దలైలామాకు మాత్రమే ఉంటుందని.. మరెవరికీ లేదని ఓ అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.15వ దలైలామాను బీజింగ్ ఎంపిక చేస్తుందని చైనా ప్రకటించడంపై భారతదేశం గురువారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడికి మాత్రమే తన వారసుడిని నిర్ణయించే అధికారం ఉంటుందని పేర్కొంది. ‘దలైలామా స్థానం కేవలం టిబెటన్లకు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఆయన అనుసరిస్తున్న లక్షలాది మందికి అతిముఖ్యమైన విషయం. తన వారసుడిని ఎంచుకునే నిర్ణయం దలైలామాదే’ అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
దలైలామా వారసుడి ఎంపికలో చైనా జోక్యం చేసుకోవడాన్ని తప్పుపట్టిన భారత ప్రభుత్వం
