ముంబయి: భారతదేశపు గ్రామీణ, వ్యవసాయ ఆధారిత వర్గాలకు జంట ప్రయోజనం చేకూర్చేలా ప్రత్యేకంగా రూపొందించిన క్షేమ కిసాన్ సాథి `బీమా పథకాన్ని అందించేందుకు కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ), క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సంస్థలు వ్యూహాత్మక బ్యాంకెష్యూరెన్స్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేవీబీ యొక్క గ్రామీణ, సెమీ-అర్బన్ బ్యాంకింగ్ సామర్థ్యాలు, క్షేమ సాంకేతికత ఆధారితమైన బీమా సేవల దన్నుతో అసంఖ్యాక కస్టమర్లకు సంపూర్ణ ఆర్థిక భద్రత కల్పించేందుకు ఇది తోడ్పడనుంది. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడటంలో కేవీబీకి దీర్ఘకాలంగా గల నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది. 109 ఏళ్లకు పైగా ఘన చరిత్ర గల కరూర్ వైశ్యా బ్యాంక్ తన సేవలను పటిష్టపర్చుకుంటూ, విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతోంది. వ్యవసాయ వర్గాల కోసం తీర్చిదిద్దిన బీమా పథకం, వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఈ ఒప్పందమ నేది భారతదేశ బ్యాంకెష్యూరెన్స్ రంగంలో గణనీయమైన మార్పును తేనుంది.
కరూర్ వైశ్యా బ్యాంక్, క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ మధ్య ఒప్పందం
