LBF News

/ Sep 26, 2025

పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా

. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

జగిత్యాల : పట్టణంలో అన్నిరకాల సౌకర్యాలు కల్పించి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.బుధవారం పట్టణంలోని 29,30, 31 ,3,6 8 వార్డుల్లో 80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు అభివృద్ధి పనులకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ భూమి పూజ చేశారు.. 44 వ వార్డులో 35 లక్షలతో వేస్తున్న సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.30,8వ వార్డులోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.పట్టణంలో అన్ని ఆలయాలు,మజీద్‌, చర్చ్‌ లకు నిధులు మంజూరు చేయటం జరిగిందన్నారు.పట్టణం పచ్చదనం,పారిశుధ్యం ప్రజల సహకారం అవసరం ఆన్నారు.జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానని, దానికి ప్రజల సహకరించాలన్నారు.తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 140 కోట్ల నిధులు పట్టణ అభివృద్ధికి మంజూరు చేయటం జరిగిందని తెలిపారు.నూతనంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి  50 కోట్ల ను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి ప్రజల పక్షాన ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.ప్రజలు లే అవుట్‌ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలిని,భవిష్యత్‌ అవసరాల,తరాల కోసం ఆలోచన చేయాలన్నారు.రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 4,520 డబల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టమన్నారు.డబల్‌ బెడ్‌ రూం ఇండ్ల కు మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తున్నానని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్‌ స్పందన ,మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం,వైస్‌ చైర్మన్‌ గోలిశ్రీనివాస్‌,ఆడువాల లక్ష్మణ్‌, అబ్దుల్‌ ఖాదర్‌ ముజాహిద్‌,డీఈ వరుణ్‌,ఏఈ లు శరన్‌,అనిల్‌, నాయకులు క్యాదాసు నాగయ్యా,దుమల రాజ్‌ కుమార్‌,పంబల రాము,ఖాజిం అలీ,కొలగాని ప్రేమలత సత్యం,వరనాసి మల్లవ్వ తిరుమలయ్య,రంగు మహేష్‌,ఓరుగంటి ప్రభాకర్‌ రావు,మహేందర్‌ రావు,ఈశ్వర్‌,మున్సిపల్‌ సిబ్బంది,మాజీ కౌన్సిలర్‌ లు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.