హైదరాబాద్ : వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో, రాబడి, భద్రత మరియు లిక్విడిటీ (ద్రవ్యత)ను సమతుల్యం చేసుకోవాలనుకునే పెట్టుబడిదారులకు మనీ మార్కెట్ ఫండ్లు ఆకర్షనీయమైన ఎంపికగా మారుతున్నాయి. స్వల్పకాలిక , అధిక-నాణ్యత గల హోల్డింగ్లకు పేరుగాంచిన ఈ నిధులు, తగ్గుతున్న వడ్డీ రేటు వాతావరణంలో ప్రయోజనం పొందేందుకు తోడ్పడనున్నాయి. ‘‘మనం ఫ్రంట్ లోడెడ్ పాలసీ సడలింపు దశలోకి అడుగుపెడుతున్నందున, మనీ మార్కెట్ ఫండ్లు పెట్టుబడిదారులకు ఒక స్మార్ట్ కేటాయింపు ఎంపికను అందిస్తున్నాయి. రెపో రేటు ఇప్పుడు 5.5శాతం వద్ద ఉండటంతో, పెట్టుబడిదారులు మనీ మార్కెట్ ఫండ్లలో రెపో కంటే అదనంగా 50-75 బేసిస్ పాయింట్లను సంపాదించవచ్చు, అదే సమయంలో లిక్విడిటీని కొనసాగిస్తూ , అనిశ్చితిని పరిమితం చేసుకోవచ్చు ‘‘ అని టాటా అసెట్ మేనేజ్మెంట్, ఫిక్సడ్ అసెట్ డిప్యూటీ హెడ్ అమిత్ సోమానీ అన్నారు.
ఆకర్షణీయంగా మారిన మనీ మార్కెట్ ఫండ్లు: టాటా ఏఎంసి
