LBF News

/ Sep 26, 2025

బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ను సన్మానించిన నోటరీ అడ్వకేట్ల సంఘం

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని నోటరీ అడ్వకేట్‌ లకు బార్‌ కౌన్సిల్‌ అండగా నిలుస్తుందని తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ ప్రాక్టీసింగ్‌ నోటరీ అడ్వకేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, మాజీ స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ గంజి యాదగిరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు హై కోర్టులోని బార్‌ కౌన్సిల్‌ కార్యాలయంలో చైర్మన్‌ తోపాటు వైస్‌ చైర్మన్‌ కే. సునీల్‌ గౌడ్‌, కార్యదర్శి వి.నాగలక్ష్మి లను కలిసారు. కృతఙ్ఞతపుర్వకంగా ముగ్గురిని శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా తానా రాష్ట్ర అధ్యక్షుడు గంజి యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ప్రాక్టీస్‌ చేస్తున్న నాలుగువేల మంది నోటరీ అడ్వకేట్ల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని అన్నారు. కొద్దిరోజుల క్రితం తాము వినతిపత్ర రూపంలో పలు సమస్యలను బార్‌ కౌన్సిల్‌ కు సమర్పించడం జరిగిందని అన్నారు. అందుకు సమ్మతించి తమకు న్యాయం చేసిన బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కార్యదర్శిలను సన్మానించి కృతజ్ఞతలు తెలిపామని అన్నారు. భవిష్యత్తులో కూడా బార్‌ కౌన్సిల్‌ తమకు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నామని గంజి యాదగిరి అన్నారు.ఈ కార్యక్రమంలో నోటరీ అడ్వకేట్ల సంఘం గౌరవ అధ్యక్షుడు గోలి దేవేందర్‌ బాబు, కార్యదర్శి మాయబ్రహ్మ నరసింహ, కోశాధికారి ఏబి.నర్సింగ్‌ రావు, కార్యవర్గ సభ్యులు కే మురళీధర్‌, ఎం.ఎం.బేగ్‌, కే.నరసింహారావు, కుమనన్‌ బలరాం, ఎం.వెంకటేశ్వర్లు, పి సతీష్‌, సుదర్శన్‌ చారి, కే. సత్యనారాయణ పాల్గొన్నారు.