ముంబైః దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, వ్యాపారులకు క్యాపిటల్ మార్కెట్ విద్యను అందించే ఉచిత బహుభాషా అభ్యాస వేదిక అయిన కోటక్ స్టాక్‌శాలను ప్రారంభించినట్లు భారతదేశ ప్రముఖ బ్రోకరేజ్ హౌస్‌లలో ఒకటైన కోటక్ సెక్యూరిటీస్ ప్రకటించింది. కోటక్ నియో యాప్ ద్వారా కూడా అందుబాటులో ఉన్న ఈ వేదిక రెండు ఫార్మాట్లలో అభ్యాసాన్ని అందిస్తుంది. అవిః 1. వీడియో ఆధారిత కోర్సులు: ప్రాథమిక, అధునాతన భావనలను కవర్ చేసే చిన్న, తేలిగ్గా అర్థం కాగల అధ్యాయాలను కలిగి ఉన్న మూడు నిర్మాణాత్మక కోర్సులు. ఇవి ప్రస్తుతం హింగ్లీష్‌లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఆంగ్లంలో ప్రారంభమవుతాయి. 2. పాఠ్య ఆధారిత కోర్సులు: ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉన్న 200 కంటే ఎక్కువ సులభంగా అర్థం చేసుకోగల అధ్యాయాలుగా విభజించబడిన ఐదు సమగ్ర కోర్సులు. అదనపు ప్రాంతీయ భాషలు త్వరలో ప్రవేశపెట్టబడతాయి. మార్చి 2025 నాటికి భారతదేశంలో 4.92 కోట్లకు పైగా యాక్టివ్ డీమ్యాట్ ఖాతాలున్నాయి. దీంతో నిర్మాణాత్మక, ఆచరణాత్మక అభ్యాస ఉత్పాదనల అవసరం పెరుగుతోంది.
కోటక్ స్టాక్‌శాలను ప్రారంభించిన కోటక్ సెక్యూరిటీస్
