LBF News

/ Sep 26, 2025

స్వచ్ఛంద రాజీనామా చేసిన సిద్ధార్థ్‌ కౌశల్‌

ఐపీఎస్‌ అధికారి సిద్ధార్థ్‌ కౌశల్‌ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల తన రాజీనామాను పలు నిరాధార ఆరోపణలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అవన్నీ పూర్తిగా అబద్ధమని, తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగత, స్వచ్ఛంద నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో తన సేవా కాలాన్ని అత్యంత సంతృప్తికరమైన ప్రయాణంగా పేర్కొంటూ? ఈ రాష్ట్రాన్ని సొంత ఊరిగా భావించానని, ఇక్కడి ప్రజలపై తనకున్న ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.