LBF News

/ Sep 26, 2025

సైదాపురం లో మైనింగ్‌ కూలీల ఆటో మళ్ళీ బోల్తా

. ఇద్దరు కూలీల పరిస్థితి విషమం,పలువురికి గాయాలు

నెల్లూరు : నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామం  తహసీల్దార్‌ కార్యాలయం సవిూపం లో  కూలీల తో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిరది. ఈ ప్రమాదం లో ఇద్దరు తీవ్రంగా గాయ పడగా పలువురికి గాయాలయ్యాయి.. సైదాపురం నుండి జోగిపల్లికి  మైనింగ్‌ లో పనిచేసేందుకు కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడడం ఈ ప్రమాదం చోటుచేసుకుంది, క్షతగాత్రులను 108 లో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు..

గతనెల 26 వ తేదీన సైదాపురం మండలం లోనే మైనింగ్‌ లో పనిచేసేందుకు కూలీలతో వెళుతున్న ఆటో కలిచేడు వద్ద బోల్తా పడడం తో 10 మందికి పైగా గాయాల పాలయ్యారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతో మంది కూలీలు ప్రాణాలు పోవడం,క్షతగాత్రులు గా మారడం,కొందరు కాళ్ళు చేతులు పోగొట్టుకుని దీర్ఘ కాలికంగా మంచంకే పరిమితం అయిపోతున్నారు,కుటుంబ పోషకులుగా ఇంటి పెద్ద గా ఉన్న వారు  ఇలా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి,,ఫిట్‌ నెస్‌ లేని ఆటోలు, నిబంధనలు పాటించని ఆటోలు,అనుభవం లేని ఆటో డ్రైవర్‌ లు,పట్టించుకొని ప్రభుత్వ అధికారులు,ఆదుకొని మైన్‌ యజమానులు తో ప్రమాదాలు జరిగినప్పుడు కూలీలు బతుకులు,వారిని నమ్ముకున్న కుటుంబ సభ్యుల జీవితాలు చీకటిలో మగ్గిపోతున్నాయి.