కొలిమిగుండ్ల : కోయిలకుంట్ల మండలంలోని గుల్లదుర్తి గ్రామంలో బుధవారం నాడు రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి స్థానిక టిడిపి నాయకులు ప్రజలు కలిసి పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో 7 లక్షల రూపాయలతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను, మరియు సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలకు వివరించారు. గత వైసిపి ప్రభుత్వం కంటే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామ టిడిపి నాయకులు , కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి…
