. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
బ్రహ్మంగారిమఠం : మైదుకూరు మున్సిపాలిటీ 18 వ వార్డు నంద్యాల రోడ్డు నందలి రాజీవ్ కాలనీ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు బుధవారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజలకు వివరించారు . ఇంటింటి పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సంబంధిత అధికారులకు సమస్యను పరిష్కరించమని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసరి బాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏపీ రవీంద్ర కులాయిశెట్టి కుమారుడు జగన్ ఇతర నాయకులు కార్యకర్తలు ప్రజలు తగలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.