LBF News

/ Sep 26, 2025

సీతారాంపురం లో మంత్రి అనిత పర్యటన

అనకాపల్లి : పాయకరావుపేట మండలం సీతారాంపురం గ్రామంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. గ్రామంలో వినాయక ఆలయంలో ప్రత్యేక పూజులు చేసి,సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్ళి ఏడాడి కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. మంత్రికి మహిళలు అడుగడుగున హారతులతో ఘన స్వాగతం పలికారు.

సీతారాంపురం గ్రామంలో నాబార్డు (60 లక్షల నిధులతో) తారురోడ్డు పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. దివిస్‌ వారి ఆర్థిక సహాకారంతో రక్షిత మంచినీటి వాటర్‌ ప్లాంట్‌  ను ప్రారంభించారు. గ్రామస్తులతో ముఖా`ముఖీలో పాల్గొని, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆదేశాలు మేరకు ప్రతీ గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది.ఏడాడి కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ప్రజలకు వివరిస్తున్నాం.పాలన ఒక సంవత్సరమే అయినప్పటికి ధైర్యంగా గ్రామాల్లోకి వస్తున్నాం.గత ప్రభుత్వంలో సీతారాంపురం గ్రామ అభివృద్ధిని గాలికి వదిలేసారు.కనీసం కల్వర్టును కూడా నిర్మించలేదు.ఎన్డియే పాలనలో కల్వర్టు నిర్మించాం.రోడ్డు శంకుస్థాపన చేశాం.పిల్లలు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం.గ్రామాల్లో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు.గ్రామ సుపరిపాలనే ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు.