LBF News

/ Sep 26, 2025

సీఎం రేవంత్‌ ఎందుకు స్పందించడం లేదు?

ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌ : నదీజలాల వాటా విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ కు తీరని అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. గోదావరి`కావేరి నదుల అనుసంధానం పేరిట 60% కేంద్రం నిధులతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం చేస్తుంటే.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం దీనిపై ఎందుకు స్పందించడం లేదు? అని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కి మధ్య ఉన్న లాలూచీ ఏమిటి అని నిలదీశారు.