LBF News

/ Sep 26, 2025

సినిమా ప్లానింగ్స్‌ జరుగుతున్నాయని విన్నాం?

అవునండి. ప్లానింగ్‌ చేస్తున్నాం. వర్కింగ్‌ టైటిల్‌ కింగ్‌ 100 అని పెట్టారు.

చాలా ఫిట్‌ గా కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆహార నియమాల్లో ఏమైనా మార్పులు చేశారా?

లేదండి. గత 15 ఏళ్లుగా  ఏం చేస్తున్నానో అదే చేస్తున్నాను. కొత్తగా చేసింది ఏవిూ లేదు.

పాన్‌ ఇండియా ట్రెండ్‌ విూద విూ ఒపీనియన్‌ ?

`పాన్‌ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలు దానికి సరిపోవు. పాన్‌ ఇండియా సినిమా అని తీసినవన్నీ కూడా పాన్‌ ఇండియా సినిమాలో కావడం లేదు కదా.

శివ 4స పనులు ఎంతవరకు వచ్చాయి ?

శివ 4కె ఫినిష్‌ అయింది. ఇంకా బెటర్‌ ఎఫెక్ట్స్‌ కోసం వర్క్‌ జరుగుతుంది. చాలా బాగా వస్తుంది. ఒక రీల్‌ చూసాను. చాలా అద్భుతంగా ఉంది.

సితార బ్యానర్‌ లో విూరు ఒక సినిమా చేస్తారాని విన్నాం?

సితార , పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ.. ఇలా అందరికీ చేయాలని ఉంది. అయితే  ప్రాజెక్ట్‌ సెట్‌ కావాలి.

కూలీలో విూ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోంది ?

`కూలీలో డిఫరెంట్‌ కరెక్ట్‌ చేస్తున్నాను. లోకేష్‌ కనకరాజ్‌ కంప్లీట్‌ న్యూ ఏజ్‌ డైరెక్టర్‌. క్యారెక్టర్‌ చాలా కొత్తగా వుంటుంది. ఫస్ట్‌ టైం ఇలాంటి క్యారెక్టర్‌ ప్లే చేశాను.