చాగలమర్రి : దేశవ్యాప్తంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారు నిన్న విడుదల చేసిన సిఏ ఫైనల్ ఫలితాల్లో చాగలమర్రి విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబర్చారు. చాగలమర్రి జామియా మసీదు వీధికి చెందిన ఆటో డ్రైవర్ ఖాజీ అబ్దుల్ జలీల్ కుమారుడు ఖాజీ అబ్దుల్ సలాం చార్టెడ్ అకౌంట్ ఫైనల్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. కాగా సలాం పదవతరగతి వరకు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసారు. అబ్దుల్ సలాం సిఎ ఫైనల్ ఉత్తీర్ణత సాధించడం పట్ల తల్లితండ్రులు , బంధువులు పలువురు స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన తమ కుమారుడు ఉన్నత చదువుల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తాము కష్టపడి చదివించినందుకు మా కష్టం ఫలించిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
సిఏ ఫైనల్ ఫలితాల్లో చాగలమర్రి విద్యార్థి ఉత్తమ ప్రతిభ
