హైదరాబాద్: భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు అయిన టాటా మోటార్స్ సరికొత్త టాటా ఏస్ ప్రోను ప్రారంభించడం ద్వారా కార్గో మొబిలిటీలో కొత్త మైలురాయిని సృష్టిస్తూ, చిన్న కార్గో మొబిలిటీలో పరివర్తన యుగానికి నాంది పలికింది. కేవలం రూ.3.99 లక్షల సాటిలేని ప్రారంభ ధరతో, టాటా ఏస్ ప్రో భారతదేశంలో అత్యంత సరసమైన నాలుగు చక్రాల మినీ ట్రక్. ఇది అసాధారణ సామర్థ్యం, సాటిలేని బహుముఖ ప్రజ్ఞ, ఉన్నతమైన విలువను అందిస్తుంది. కొత్త తరం వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడానికి రూపొందించబడిన టాటా ఏస్ ప్రో పెట్రోల్, రెండు రకాల ఇంధనం (సీఎన్జీ ం పెట్రోల్), ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది వినియోగదారులకు వారి వ్యాపార అవసరాలకు అనువైన ఉత్పాదనను ఎంచుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ 1250 వాణిజ్య వాహనాల అమ్మకాల టచ్పాయింట్లలో లేదా టాటా మోటార్స్ ఆన్లైన్ అమ్మ కాల ప్లాట్‌ఫామ్ అయిన ఫ్లీట్ వెర్స్‌లో కస్టమర్లు తమకు నచ్చిన ఏస్ ప్రో వేరియంట్‌ను బుక్ చేసుకోవచ్చు.
సరికొత్త టాటా ఏస్ ప్రోతో కొత్త శకానికి నాంది
