విజయవాడ : వైకాపా నేత బత్తల హరిప్రసాద్ నివాసంలో మంగళవారం రాత్రి సిబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేనట్లు సమాచారం. దాంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు అవసరమైన సమాచారాన్ని సేకరించారు. వైద్యకళాశాలల్లో సీట్ల భర్తీ, ప్రైవేటు కళాశాలలకు అనుమతులు ఇప్పించే విషయంలో ఆయన లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
వైకాపా నేత ఇంట్లో సీబీఐ సోదాలు
