LBF News

/ Sep 26, 2025

వైఎస్‌ షర్మిల ఫోన్‌ సైతం ట్యాప్‌ !!

హైదరాబాద్‌ : తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. వైకాపా అధినేత, ఏపీసీసీ ఛీఫ్‌  వైఎస్‌ షర్మిల ఫోన్లు ట్యాప్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ట్యాపింగ్‌ వ్యవహారంతా అత్యంత గోప్యంగా  జరిగింది.వైసిపి అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్‌ రికార్డులు అయినట్లు సమాచారం . షర్మిల ఎవరెవరితో మాట్లాడుతుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ‘’ అన్నకు ‘‘ చేరవేసారు. షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా  వుంచారు. షర్మిల దగ్గరి మనుషులను పిలిపించినా ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి ద్వారా వార్నింగ్‌ ఇచ్చినట్లు కుడా వార్తలు వస్తున్నాయి. తన ఫోన్లు ట్యాప్‌ అవుతున్నట్లు అప్పట్లోనే షర్మిల గుర్తించారు.