బద్వేలు : కడప జిల్లా దువ్వూరు మండలంలోని మురళి నగర్ గ్రామానికి చెందిన గురువు రెడ్డి కుమారుడు చంద్రఓబుల రెడ్డి కి పెళ్లి సంబంధం నిమిత్తం చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామానికి చెందిన మ్యారేజ్ ఆర్గనైజర్ కేశవరెడ్డి, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన షబీనా, విజయవాడకు చెందిన లక్ష్మీ, శాలిని, నందిగామకు చెందిన జానీ భాష లు కలిసి జ్యోతి రెడ్డి అనే నవ వధువుతో వివాహ నిశ్చయం చేసి, వరుడు తరఫున రెండు లక్షల రూపాయలు ప్యాకేజీగా నిర్ణయించి, గుంటూరులోని పెద్దకాకాని గుడిలో వివాహం నిర్వహించారు.వివాహం అయిన వారంపాటు తర్వాత, నవ వధువు జ్యోతి రెడ్డి వరుడు ఇంటి నుండి కొంత బంగారు ఆభరణాలు తీసుకొని అర్ధరాత్రి సమయంలో లారీ ఎక్కి పారిపోయిందని వరుడు చంద్రఓబుల రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు.
కేసు విచారణలో జానీ భాష, లక్ష్మీ దేవి, కేశవరెడ్డి, శాలిని లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. కాగా నవ వధువు జ్యోతి రెడ్డి కొంతమంది మ్యారేజ్ ఆర్గనైజర్లు ఇంకా అరెస్టు కావలసి ఉంది.