LBF News

/ Sep 26, 2025

లారీని ఢీ కొన్న కారు

. ఫిల్మ్‌ నగర్‌ ఎస్సై మృతి

. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన ఎస్సై రాజేశ్వర్‌

సంగారెడ్డి : చెర్యాల గేటు దగ్గర  లారీని కారు ఢీకొన్న ఘటనలో ఫిల్మ్‌ నగర్‌ ఎస్సై రాజేశ్వర్‌ మృతి చెందారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. ఎస్సై రాజేశ్వర్‌ స్వస్థలం సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీ. వారం రోజుల క్రితమే హైదరాబాద్లోని ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.  మృతునికి భార్య ఇద్దరు పిల్లలు. మూడు రోజుల నుండి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద విధి నిర్వహణలో ఎస్‌ఐ రాజేశ్వర్‌ వున్నారు. మృతుడు 1990లో పోలీస్‌ శాఖలో ఉద్యోగంలో చేరాడు. అర్ధరాత్రి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంలో గాయపడ్డ ఎస్సై రాజేశ్వర్‌ ను సవిూపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేస్తుండగానే మృతి చెందారు.