. లోకేష్
మచిలీపట్నం : రెడ్ బుక్ పేరు ఎత్తితే చాలు వైకాపా నేతలకు గుండె పోటు వస్తోందని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో ఆయన విూడియాతో మాట్లాడారు. ‘పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదని ‘తల్లికి వందనం’ అమలు చేశాం. కూటమి సర్కార్లో మహిళలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం. కానీ వైకాపా హయాంలో స్త్రీలను కించపరచి, అగౌరవపరిచారు. కానీ మా ప్రభుత్వం మహిళల గౌరవం పెరిగేలా చర్యలు తీసుకుంటోంది’ అని ఆయన పేర్కొన్నారు.