LBF News

/ Sep 26, 2025

యోగాంధ్ర వరల్డ్‌ రికార్డుకు సిద్దం.. ఆర్కే బీచ్‌ వద్ద భారీ ఏర్పాట్లు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌

175 దేశాల ప్రతినిధులు యోగా కార్యక్రమంలో పాల్గొంటారు

తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

విశాఖ ` 19 జూన్‌ : విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు 175 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. బీచ్‌ రోడ్డు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో విూడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సదంర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రపంచ రికార్డు స్థాయిలో జరుగుతుందని, విశాఖ నుంచి భీమిలి వరకూ 29.8 కి.విూ. పొడవున కార్యక్రమం నిర్వహిస్తామని, ఒక్క బీచ్‌ రోడ్డులోనే 3.26 లక్షల మంది పాల్గొంటారని చెప్పారు. ఇంకా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పాల్గొనే వారితో కలిపితే మొత్తం ఐదు లక్షల మంది అవుతారన్నారు. వైజాగ్‌ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయండని ఆయన పిలుపునిచ్చారు.