నువ్విలా,జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో ఓ క్రేజీ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి నిఖిల కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా హవీష్, నక్కిన త్రినాథరావు మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా..నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడిరచనున్నారు.
నటీనటులు ` హవీష్, తదితరులు