LBF News

/ Sep 26, 2025

మెగాస్టార్‌ చిరంజీవి, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మెషిన్‌ అనిల్‌ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్మెంట్స్‌ చఓవణజీ157 ముస్సోరీ షెడ్యూల్‌ పూర్తి

మెగాస్టార్‌ చిరంజీవి, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మెషిన్‌ అనిల్‌ రావిపూడి మోస్ట్‌ అవైటెడ్‌ చఓవణజీ157.  చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.  ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా మేకర్స్‌ ముస్సోరీ షెడ్యూల్‌ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌ లో చిరంజీవి, నయనతార విూద కీలక సన్నివేశాలు షూట్‌ చేశారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలెట్‌ గా ఉండబోతున్నాయి.  కమర్షియల్‌ ఫార్మాట్లలో హిలేరియస్‌ ఎంటర్‌ టైనర్స్‌ చిత్రాలను రూపొందించడంలో మాస్టర్‌ అయిన అనిల్‌ రావిపూడి ప్రమోషనల్‌ కంటెంట్‌ను రూపొందించడంలో స్పెషలిస్ట్‌. ఇప్పటివరకు చఓవణజీ157 ప్రతి ప్రమోషనల్‌ వీడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇటివలే ముస్సోరీ షెడ్యూల్‌ నుంచి రిలీజ్‌ చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్‌ అవతార్‌లో అలరించారు.

ఈ చిత్రానికి సవిూర్‌ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్‌ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌. ఎస్‌. కృష్ణ,  జి. ఆది నారాయణ కో రైటర్స్‌. ఎస్‌. కృష్ణ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్‌ ప్రకాష్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌.

చఓవణజీ157 మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

నటీనటులు: మెగాస్టార్‌ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్‌