LBF News

/ Sep 26, 2025

మాదకద్రవ్యాల వినియోగం,అక్రమ రవాణా చట్టరీత్యా నేరం

. జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌. శ్రీనివాస్‌

జగిత్యాల : మాదకద్రవ్యాల వినియోగం,అక్రమ రవాణా చట్టరీత్యా నేరం ఆని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌ శ్రీనివాస్‌ అన్నారు.

మాదకద్రవ్యాల వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్‌ 26 )ను పురస్కరించుకొని బుధవారం జిల్లాలోని సబ్‌ జైల్‌ తోపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో వేరు వేరుగా ఖైదీలకు,విద్యార్థులకు జిల్లా ఉప వైద్యాధికారి  డాక్టర్‌ ఎన్‌. శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరమని శారీరక స్థితిగతుల్లో అనేక మార్పులు సంభవిస్తాయని తెలిపారు. తద్వారా నిరాశ నిస్పృహ లోకి వెళతారని తెలిపారు. విద్యార్థులు మంచి ఆహారపు అలవాట్లను నేర్చుకోవాలని, సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిలగడ్డ వైద్యాధికారి డాక్టర్‌ సంతోష్‌ ,ఏఎన్‌ఎంలు ఆశా కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.