LBF News

/ Sep 26, 2025

మాదకద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి

యర్రగుంట్ల : యర్రగుంట్ల గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌ లో మాదకద్రవ్య నిరోధక వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యర్రగుంట్ల సీఐ నరేష్‌ బాబు, ఎక్సేజ్‌ సిఐ గోపికృష్ణ, ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ శ్రీనాథ్‌ తదితరులు పాల్గోన్నారు.  కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ త్రివిక్రమ్‌ రెడ్డి అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ‘‘దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, తమ భవిష్యత్తును చీకటిలో నెట్టకూడదు,’’ అని పిలుపునిచ్చారు. పట్టణాలకే కాదు, చిన్నచిన్న గ్రామాల వరకు మాదకద్రవ్య వినియోగం విస్తరించడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు.

గంజా, కోకైన్‌, హెరాయిన్‌, టొబాకో వంటి మాదక పదార్థాల వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇవి వ్యక్తిగతంగా కాక సమాజానికే పెనుముప్పుగా మారుతున్నాయి. యువత ఇటువంటి మత్తు పదార్థాల నుంచి అప్రమత్తంగా ఉండాలి,’’ అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.