జగిత్యాల : జిల్లా కేంద్రంలోని మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అకాడమిక్) డైరెక్టర్ డాక్టర్ శివరామకృష్ణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లోని అన్ని విభాగాలు తనిఖీ చేశారు. టీకాలు ఇచ్చే సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ను సందర్శించి ప్రత్యేక చికిత్స పొందుతున్న పిల్లలను గమనించారు. లేబర్ రూమ్ సౌకర్యాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్చార్జి సూపరెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు , జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ మరియు వైద్య సిబ్బందితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.ప్రభుత్వ దావాఖానలో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రకారం ప్రభుత్వ దవాఖానలో డెలివరీ లను ప్రోత్సహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, తగిన వనరులను సమకూర్చాలని కోరారు. వైద్య సిబ్బంది ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సమయపాలన పాటించి మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఏ శ్రీనివాస్, ఎన్ హెచ్‌ఎం డిపిఓ రవీందర్, వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్ డాక్టర్ శివరామకృష్ణ
