LBF News

/ Sep 26, 2025

మహిళలు తమ సమస్యలు  తెలపడానికి  24 గంటలు హెల్ప్‌ లైన్‌/ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు

. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు డా. అర్చన మంజుదార్‌

తిరుపతి : మహిళల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషన్‌ కృషి చేస్తుందని, మహిళల రక్షణ కోసం  24 గంటలు హెల్ప్‌ లైన్‌/ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ అర్చన మంజుదారి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరట్‌ లోని సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన రాష్ట్రీయ మహిళా ఆయోగ్‌ ఆప్కే ద్వార్‌,  మహిళా జన్‌ సున్వై అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ అర్చన మంజుదార్‌ తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ డా ఎస్‌ వెంకటేశ్వర్‌, ఎస్‌ పి హర్ష వర్ధన్‌ రాజు. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు మహిళల భద్రత, వారి హక్కుల ను కాపాడటనీ గురించి మాట్లాడుతూ..  మహిళలు రక్షణ వారి హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషన్‌ కృషి చేస్తుందని, మహిళల రక్షణ కోసం  24 గంటలు మహిళా కమిషన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. బాధితులు ఏ సమయంలోనైనా తమకు ఫిర్యాదు చేయవచ్చని తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. తమ సమస్యలను  హెల్ప్‌ లైన్‌/ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని అన్నారు. జిల్లాలో మహిళలకు సంబంధించిన కేసును పరిష్కరించడానికి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. వరకట్నం, సైబర్‌ నేరాలు, లైంగిక నేరాలు, ఆర్థిక సమస్యలు వంటి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలోనే మహిళలకు సంబంధించిన చాలా కేసులు పెండిరగ్లో ఉన్నాయని త్వరితగతిన వాటిపైన కూడా యాక్షన్‌ తీసుకొని తొందరగా పరిష్కారం చూపుతామని తెలిపారు. తిరుపతి జిల్లా కు సంభందించి చాలా కేసు లు వచ్చాయనీ వాటికి కూడా  వెంటనే  పరిష్కరిస్తాం అని అన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ… మహిళ ల కు సంభందించిన సమస్యలను పరిష్కరించే దిశగా ఈరోజు జాతీయ మహిళా కమిషన్‌ జిల్లాకు రావడం జరిగింది తెలిపారు. 8 జిల్లాలకు గ్రీవెన్స్‌ కు  సంబంధించిన మహిళా జన్‌  సున్వై  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చిన ప్రతి సమస్యలను మహిళా కమిషన్‌ వారి సమస్యలను విని అక్కడికక్కడే విని ప్రతి కేసుకు సంబంధించిన పురోగతి వివరాలను తెలుసుకొని న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు. జిల్లాలోని  మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చి మహిళా కమిషన్‌ అప్పటికప్పుడే  స్పందిస్తుందని అన్నారు. మహిళలు తమ సమస్యలను ఏ సమయంలో అయినా హెల్ప్‌ లైన్‌/ మెయిల్‌ ద్వారా తెలపవచ్చని, ఈ విషయంలో జిల్లా యంత్రాంగం తరపున అడ్మినిస్ట్రేషన్‌, పోలీస్‌ శాఖ టేక్‌ అప్‌ చేసి విచారణ  చేయడం జరుగుతుందని అందరికీ తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. మహిళల రక్షణ కోసం,  మరియు వారి సమస్యలను చెప్పుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని తెలిపారు. కమిషన్‌ ముందే కంటే కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ వారి దృష్టికి వచ్చిన కేసులను విచారణ చేపట్టి వాటిని పరిష్కరించిన యెడల చాలా కేసులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ కూడా తమ సమస్యలకు సంభందించిన గ్రీవెన్స్‌ లను మహిళా కమిషన్‌ కు  తెలుపవచ్చు అని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యను పర్సనల్‌ గా  తీసుకొని పరిష్కారం చూపేలా మహిళా కమిషన్‌ కృషి చేస్తుందని తెలిపారు. కంప్లైంట్‌ చేసిన వారు మరియు రెస్పాండెన్స్‌ వారి సమస్యలను నేరుగా తెలుపవచ్చు అన్నారు. జాతీయ కమిషన్‌, బృందం సమస్యలను విని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా సమస్యలను పరిష్కరించాలి అనే దిశగా అర్జీలదారులకు పరిష్కారం చూపుతారని అలాగే వారికి తొందరగా న్యాయం కూడా జరుగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమానికి తిరుపతి , చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం,కడప జిల్లాల పోలీస్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోఖాయ బేగం మెంబర్‌, అడ్వకేట్‌ లు కంచి శ్యామల,కోమలాదేవి శారద, నేశమ చౌదరి, చంద్రశేఖర్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి వసంత బాయి, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.