LBF News

/ Sep 26, 2025

భూభారతి సదస్సును అడ్డుకున్న రైతులు

యాదాద్రి : భువనగిరి మండలం, రాయగిరి లో.. భూభారతి అవగాహన సదస్సును రైతులు అడ్డుకున్నారు. వడాయిగూడెం గ్రామంలోని 518 సర్వేనెంబర్‌ సమస్యను తొలగించాలని గ్రామస్తులు సభలో ఆందోళనకు దిగారు. రైతులకు ఇంతవరకు రైతుబంధు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రైతుల కష్టాలు మారవా అని అధికారులను నిలదీసారు.