రాయచోటి : అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం లోని సంబేపల్లి మండలంలో ని మోటకట్లలో ని శివ సాయి ఆలయంలో శుక్రవారం బోనాల పండుగ భక్తి పార్వస్యంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోక్షణల మధ్య మేళతాళాల నడుమ అమ్మవారి నామస్మరణ స్మరణలతో బోనాల పండుగ కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి భక్తిపూర్వకంగా మొట్టమొదటి బోనాల పండుగ జరుపుకొన్నారు. మోటకట్లలోని శ్రీ వేంకట శివ సాయి దేవస్థానం ప్రాంగణం భక్త జన సందోహంతో కళకళలాడిరది. ఈ ఆలయంలో తొలిసారి బోనాల పండుగ ఎంతో ఘనంగా, శ్రద్ధాభక్తులతో మహిళలు జరుపుకొన్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి అభిషేకం నిర్వహించగా, అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సంప్రదాయ బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు కోసం పూజలు చేశారు. పాల పొంగళ్ళు అమ్మవారికి బోనాలుగా సమర్పించారు .అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
భక్తి పార్వస్యంగా బోనాల పండుగ
