. కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి : ప్రజల నుండి అందిన పిర్యాదులను ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక లో వచ్చిన సమస్యలను కమిషనర్ గురువారం కొర్లగుంట, సాయి విష్ణు లేఔట్, ఇఎస్ఐ హాస్పిటల్, తిరుమల బైపాస్ రోడ్డులోని ప్రాంతాలను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయి విష్ణు లేఔట్ లో నూతనంగా నిర్మించిన అపార్ట్మెంట్ లో అన్ని నిబంధనల మేరకు ఉన్నాయా అని మరో మారు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ ఎస్ ఐ హాస్పిటల్ వద్ద మురుగు కాలువలోని చెత్తను వెంటనే తొలగించి, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా విభాగాల అధికారులు అందరూ వారి వారి పరిధిలోని ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. కమిషనర్ వెంట ఏసిపి మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు, ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు.