LBF News

/ Sep 26, 2025

పొలం పిలుస్తోంది రా

బ్రహ్మంగారిమఠం : మైదుకూరు వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని  యస్‌.మైదుకూరు మండలంలోని వనిపెంట రైతు సేవా కేంద్రం పరిధిలోని వనిపెంట , పోతిరెడ్డిపల్లి లో గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోమండల వ్యవసాయ అధికారి శ్రీ. ఈ.బాల గంగాధర్‌ రెడ్డి ,కే వి కె శాస్త్రవేత్త ఫిరోజ్‌ హుస్సేన్‌ పాల్గొనడం జరిగింది. రైతు సేవా కేంద్రం  సహాయకులు హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పాల్గొని రైతులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం అమలు గురించి వివరించడం జరిగింది.లూజు విత్తనాలను రైతులు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదు అని తెలిపారు.జింక్‌ సల్ఫేట్‌, జిప్సం 50% సబ్సిడీపై పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలిపారు.అలాగే వచ్ఛే ఖరీఫ్‌ సీజన్‌ కి సంబందించి అందరు పంటలు వేసిన తర్వాత విూ యొక్క ఖీూఐ లో పంట నమోదు తప్పనిసారిగా చేయించుకోమని రైతులకు సూచించారు . మరియు ఇతర పథకాల గురించి రైతు సేవా కేంద్రం అందించే సేవలు గురించి వివరించారు వరి నారు నాటుట కు వారం రోజుల ముందు సెంటు విస్తీర్ణముకు 160 గ్రాములు చొప్పున కార్బోఫురాన్‌ గుళికలు వేసుకోవాలి.రసం పీల్చు పురుగులు, ఉల్లికోడు, కాండం తొలుచు పురుగు నివారణ జరుగుతుంది..అలాగే కాలి బాటలు,నారు కొసలు తుంచి నాటడం, గట్ల వెడల్పు పెంపు, జింక్‌,పొటాష్‌ వాడకం, నత్రజని సమతుల వాడకం వంటి అంశాలపై రైతులకు వివరించడం జరిగింది. అలాగే.80% సబ్సిడీ పై కిసాన్‌ డ్రోన్‌ పంపిణీ వంటి ప్రయోజనాలు వివరించడం జరిగింది. కె వి కే, ఐపఐ శాస్త్రవేత్త ఫిరోజ్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ అరటి, పసుపు పంటల్లో వచ్చే చీడపీడల గురించి వాటి నివారణ చర్యలు గురించి వివరించారు, పకృతి వ్యవసాయ సిబ్బంది ద్రవ జీవామృతం  తయారు చేసుకునే విధానాన్ని డెమో ద్వారా చూపించడం జరిగింది.