LBF News

/ Sep 26, 2025

పేద విద్యార్థులకు వరం.. మహా గురుకులం..!

 . జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి

బ్రహ్మంగారిమఠం : నాణ్యమైన విద్య, అధునాతన వసతులతో రూపుదిద్దుకున్న డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ (బాలుర) మహా గురుకులం విద్యాలయం.. పేద విద్యార్థుల పాలిట వరం అని జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి అభివర్ణించారు. బుధవారం బి.మఠం మండలంలో నూతనంగా ఏర్పాటైన డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ మహా గురుకులం (బాలుర) విద్యాలయంలో ఆకాడమిక్‌ భవనాల్లో తరగతులు, వసతి గృహ భవనాల జిల్లా కలెక్టర్‌ డి.. శ్రీధర్‌ చెరుకూరి, మైదుకురు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌, జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌ కుమార్‌ లతో కలిసి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ… బి.మఠం మండల కేంద్రానికి సవిూపంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వసతులతో సువిశాల ప్రాంగణంలో రూపు దిద్దుకున్న డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ మహా గురుకులం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వచ్చిందన్నారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులకు విద్యా వసతులు కల్పించగల సామర్థ్యం ఉన్న ఈ బాలుర మహా గురుకులంలో.. ఈ విద్యా సంవత్సరానికి గాను 640 మంది విద్యార్థులతో అడ్మిషన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆధునాథనమైన సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందించే మహా గురుకులంలో.. చేరేందుకు అర్హులైయిన పేద విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఈరోజు భారత దేశం ఆర్థిక అభివృద్ధిలో 4వ స్థానంలో నిలుచుందంటే.. అందుకు కారణం మన విద్య వ్యవస్థపై మన ప్రభుత్వాలు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ వల్లనే అన్నారు. మన పూర్విక మహా ఋషులు అవలంభించిన ఒక విలువలతో కూడిన విద్య వ్యవస్థ మన దేశంలో ఇప్పటికీ కొనసాగుతోందని.. అలాంటి విద్యా వ్యవస్థే.. ఈ గురుకుల విద్యాలయ వ్యవస్థ అన్నారు. సమాజంలో పిల్లలకు అద్భుతమైన విద్యను అందించడమే.. ఒక గొప్ప నాయకుడి నిజమైన బాధ్యత అన్నారు. ఎక్కువగా రాజాకీయ నాయకులు తమ ఊర్లలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకే. మొగ్గు చూపుతారన్నారు. అయితే… మైదుకురు ఎమ్మెల్యే మాత్రం మౌలిక వసతులకంటే ముందు విద్యాలయాన్ని నెలకొల్పితే.. ఎంతో మంది విద్యావంతులు, వారి ద్వారా ఎంతో మంది ప్రయోజకులు ఎత్పన్నం అవుతారన్న ఆలోచనతో.. మహా గురుకులం అభివృద్ధికి నిరంతరం శ్రమించారన్నారు. ఆయనతో పాటు ఆర్డీవో, అధికారుల కృషీ ఫలితమే.. ఈ మహా గూరుకులం పరిపూర్ణతకు నిదర్శనం అని ప్రశంసించారు.అందరి సమిష్టి కృషితోనే.. మహా గురుకులం లాంటి ఆదర్శనీయ భవనాలు మన ముందు గొప్ప విద్యాలయాలుగా ఎదుగుతాయన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో  ఈ మహా గురుకులం జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలను అందిస్తోందని, అలాగే 2027 విద్య సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమమైన ఫలితాలను అందివ్వాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఈ మహా గురుకులం జిల్లా కీర్తిని రాష్ట్ర స్థాయిలో రెపరిప లాడిరచే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్‌ ఆకాంక్షించారు.I

ఎమ్మెల్యే సుధాకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. 2016 లో ఈ గురుకులం  ప్రాజెక్టు నిర్మాణానికి సంబందించి అనుమతులు, టెండర్లు కూడా పూర్తి చేసి.. రూ. 21 కోట్ల వ్యయంతో మహా గురుకులం నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందన్నారు. సంబందిత పనులను ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందన్నారు. కానీ గత ప్రభుత్వంలో మిగిలిన  పెండిరగ్‌ పనులను పూర్తి చేయడంలో అలసత్వం వహించిందన్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ వారి ప్రత్యేక చొరవతో రెండు వారాల్లోనే పెండిరగ్‌ లో ఉన్న ఫర్నిచర్‌, కిచెన్‌ సామగ్రి, కంప్యూటర్స్‌ తదితర వస్తువులను సమకూర్చడం జరిగిందన్నారు. అంతేకాకుండా.. తాజాగా రూ.1.23 కోట్ల వ్యయంతో రోడ్లు, ప్లే గ్రౌండ్‌, సుందరీకరణ పనులను పూర్తి చేయడంనారిగిందన్నారు. అడ్మిషన్లు పూర్తయ్యేలోపు అన్ని రకాల సిద్దం చేయాలని సంబందిత అధికారులను అదేశించారు.