LBF News

/ Sep 26, 2025

పిడుగురాళ్లలో ఘనంగా డాక్టర్స్‌ డే అవార్డ్స్‌, సన్మాన సభ

ముఖ్య అతిథిగా ఐఎంఏ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మోటూరి చంద్రబోస్‌

పిడుగురాళ్ల : నేషనల్‌ డాక్టర్స్‌ డే సందర్బంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, పిడుగురాళ్ల బ్రాంచ్‌, డాక్టర్‌ ధూళిపాళ్ళ భరత్‌ కుమార్‌ అధ్యక్షతన ‘‘డాక్టర్స్‌ డే అవార్డ్స్‌ డ సన్మాన సభ 2025 ను, పిడుగురాళ్ల భవనసి కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి, డాక్టర్‌ మొటూరి చంద్ర బోస్‌ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. పల్నాటి ప్రజలకు జీవిత కాలం గా చేస్తున్న విశిష్ట వైద్య సేవలకు గుర్తింపుగా సీనియర్‌ వైధ్యులకు ‘‘డాక్టర్‌ అఫ్‌ డిస్టింక్షన్‌ అవార్డు, 2025  సంవత్సరం కు గాను డాక్టర్స్‌ ను ఎంపీక చేసి సన్మానిచచడం జరిగింది. ఈ సభ ను ముఖ్యఅధితి జ్యోతి ప్రజలన చేసి ప్రారంభిచారు. తదుపరి ఆయన చేతులవిూదుగా డాక్టర్‌ భరత్‌ కుమారు పిడుగురాళ్ల బ్రాంచి లోగోని ఆవిష్కరింపచేశారు. డాక్టర్‌ బి. సి. రోయ్‌ ని గుర్తు చేసుకుని అయన చిత్రపటానికి పుష్పమాల తో గౌరవించారు. ఈ కార్యక్రమం లో ఐ. ఎం. ఏ, పిడుగారాళ్ల బ్రాంచ్‌ అధ్యక్షులు డాక్టర్‌ ధూళిపాళ్ళ భరత్‌ కుమార్‌, ముఖ్య అతిధి డాక్టర్‌ మొటూరి సుభాష్‌ చంద్ర బోస్‌ చేతులు విూదుగా పలువురు సీనియర్‌ వైద్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం వారిని పూలమాలలతో, దుశ్యాలు వాలతో  ఘనంగా సన్మానించారు. అలా సన్మానించ బడిన వారి లో కారంపూడి లోని శ్రీ వెంకటేశ్వర నర్సింగ్‌ హోమ్‌ అధినేత డాక్టర్‌ నాయుడు వసంత రావు, పిడుగురాళ్ల లోని చిగురుపాటి హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ సి. సి. సుబ్బారావు, నీరజ నర్సింగ్‌ హోమ్‌ అధినేత డాక్టర్‌ డాక్టర్‌ బాదాం శివారెడ్డి, విజయ నర్సింగ్‌ హోమ్‌ అధినేత డాక్టర్‌ కె. వి. సుబ్బారావు, రామకృష్ణ నేత్రలయం అధినేత డాక్టర్‌ ఆలా సాంబశివ రావు ఉన్నారు. ఈ అవార్డు గ్రహీతలు 40 సంవత్సరాల పైబడి వైద్య సేవలు అందిస్తూ, ఏ సదుపాయలు లేని రోజులనుండి ఈ పల్నాటి ప్రజలకు, మరియు అసోసియేషన్‌ కు అనేక విధములు గా సేవలు చేస్తూ వృత్తి లో రానించి ప్రజల మన్ననలు పొంది యున్నారు. వీరి వైద్య సేవలను పలువురు డాక్టర్స్‌ కొనియాడారు. వీరికి వేద పండితుల ఆశీర్వచనం తో పూర్ణ కుంభం తో, మంగళ వాయిధ్యాల్తో సభలోనికి ఆహ్వానించి, డాక్టర్‌ అఫ్‌ డిస్టింక్షన్‌ అవార్డు ప్రధానము చేసి, ఘనంగా సన్మానించడం జరిగింది. అధ్యక్షలు డాక్టర్‌ ధూళిపాళ్ళ భరత్‌ కుమార్‌ మాట్లాడుతూ, వారికీ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి పల్నాటి ప్రజలకు, అసోసియేషన్‌ కు సేవలు చేయాలనీ కోరుకున్నారు. ముఖ్యఅతిది, సుభాష్‌ చంద్ర బోస్‌ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ లో 99 బ్రాంచి లు ఉండగా, పిడుగురాళ్ల బ్రాంచి ఈ సంవత్సర కాలం లో భరత్‌ కుమార్‌ అధ్యక్షతన 17 వ స్థానం కు చేరిందని తెలియచేస్తూ, ఈ విజయం బ్రాంచి సభ్యుల సహకారం తోనే సాధ్యమని కొనియాడారు. విజయవాడ వరదల సమయయం లో ముఖ్యమంత్రి సహాయనీదికి ఐ. ఎం. ఏ రాష్ట్ర శాఖ 25 లక్షల రూపాయలు అందించగా, అందులో పిడుగురాళ్ల బ్రాంచి నుండి లక్షరూపాయలు అందించారాని, ప్రజాసేవలో కూడా తమవంతు పాలుపంచుకున్నారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మిక్సపతి వైద్యవిధానానికి ఐ. ఎం. ఏ. వ్యతిరేకిస్తుందని, దానివలన ప్రజలకు సరైన వైధ్యం జరగదని, అన్ని వైధ్య విదానాలు, సరిఅయినవేగానీ, మిక్సపతి వలన నష్టం జరుగుతుందని, దీని గురించి ఐ. ఎం. ఏ. పోరాడుతుందని తెలియసారు. బ్రాంచి సభ్యత్వం పెరిగాలని కోరారు. కాన్సర్స్‌ గురించి హెల్త్‌ అవేర్నెస్‌ చేయాలనీ, తద్వారా కాన్సర్‌ ను నివారించ వచ్చని తెలియచేసారు. ఈ సభ చూస్తే, మరిన్ని సార్లు, పిడుగురాళ్ల రావాలనిపిస్తుంది అని ఆయన కొనియాడారు. ఈ సభ కు పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లి కారంపూడి నుండి డాక్టర్స్‌ అందరూ, కుటుంబ సభ్యులు మరియు పాత్రికేయ మిత్రులు హాజరై సభ విజయవంతం చేసారు. సభకు హాజరై, సభను విజయం వంతం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు డాక్టర్‌ ధూళిపాళ్ళ భరత్‌ కుమార్‌ ధన్యవాదములు తెలియచేసారు.