LBF News

/ Sep 26, 2025

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

. మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌

కోరుట్ల : ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌ ఆన్నారు.ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్‌ రవీందర్‌ పరిశీలించారు.ఈ సంధర్భంగా కాలువల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను జేసీబీ తో తొలగించారు. కాలనీల్లో రోడ్ల పక్కన పెరిగిన ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను మున్సిపల్‌ సిబ్బంది చే తొలగించి శుభ్రం చేపించారు. రోడ్లపై అక్కడక్కడ నిలువ ఉన్న నీరుని తొలగించి భవన నిర్మాణాల నుంచి వచ్చే వ్యర్ధాలతో పూడ్చడం జరిగింది.ఒకసారి వాడి పారేసే సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ ను వినియోగించొద్దని ప్రజలకు సూచించారు. వానాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.. అలాగే సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ ని వాడొద్దని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సానిటరీ ఇన్స్పెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, అశోక్‌,జవాన్లు, వార్డు ఆఫీసర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.