విజయవాడ : విజయవాడ జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల అయ్యారు. అన్ని కేసుల్లోనూ వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. దాంతో బుధవారం నాడు అయన బెయిల్పై విడుదలైయ్యారు.
ఈ సందర్భంగా వైకాపా నేత పేర్ని నాని మాట్లాడుతూ వంశీపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. చట్టంలోని లొసుగులు అడ్డుపెట్టుకుని కేసులు పెట్టారు. సుప్రీంలో కూడా బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ వేశారు. అనారోగ్యంతో ఉన్నా కూడా వదిలిపెట్టలేదని అన్నారు. వంశీ ఇప్పుడు కాకపోయినా 4 ఏళ్ల తర్వాత అయినా.. గన్నవరం నుంచి రాజకీయాలు మొదలుపెడతారని అన్నారు.