తిరుపతి : తిరుపతి సవిూపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు జరుగనున్నాయి. ఈ సందర్భంగా జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జూలై 03న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించనున్నారు. ఉదయం 07 నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడుతారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసి మధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన ఉదయం 11 ` 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. సాయంత్రం 5 ` 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి 07 ` 08 గం.ల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.జూలై 01వ తేదీన ఉదయం 11 ` 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 ` 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి 07 ` 08 గం.ల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు. జూలై 02వ తేదీన స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ అనంతరం, సాయంత్రం 6.30 ` 07.00 గం.ల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. రాత్రి 07 ` 08.30 గం.ల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు
