LBF News

/ Sep 26, 2025

జులై 11న విడుదల కానున్న వర్జిన్‌ బాయ్స్‌ చిత్రం నుండి దం దిగ దం సాంగ్‌ లాంచ్‌

రాజ్‌ గురు బ్యానర్‌ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్‌ గడ్డం రచనా దర్శకత్వంలో జూన్‌ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్‌ బాయ్స్‌. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్‌, శ్రీహాన్‌, జెన్నీఫర్‌ ఇమాన్యుల్‌, రోనిత్‌, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్‌ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌ గా పని చేయగా జేడీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్‌ మంద, ఆర్జె సూర్య, సుజిత్‌ కుమార్‌, కేదార్‌ శంకర్‌, ఆర్జె శరన్‌, శీతల్‌ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నేడు ఈ చిత్రం నుండి విడుదలైన దం దిగా దం పాటకు ప్రణవ్‌ చాగంటి లిరిక్స్‌ అందించగా యాసిర్‌ నిసర్‌ తన స్వరాన్ని అందించారు. మార్తాండ్‌ కె వెంకటేష్‌ చిత్రానికి ఎడిటింగ్‌ పనిచేశారు.

ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్ర పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా వర్జిన్‌ చిత్ర నిర్మాత రాజా దారపనేని మాట్లాడుతూ… ‘‘సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ కి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటికే వర్జిన్‌ బాయ్స్‌ చిత్రం నుండి టీజర్‌ ఇంకా ఒక పాటకు మంచి స్పందన లభించింది. సినిమా యూత్‌ ఫుల్‌ గా ఉండబోతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు ఈ చిత్రాన్ని ఎన్నో ప్రశంసలతో కొనియాడారు. ఆడవారు కూడా చిత్రాన్ని ప్రశంసించడం ప్రత్యేకంగా కనిపించింది. చిత్రంలో ఎంటర్టైన్మెంట్‌ తో పాటు మంచి లవ్‌ స్టోరీ కూడా ఉంటుంది. చిత్రానికి సెన్సార్‌ నుండి ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. చిత్రాన్ని నైజంలో ఏషియన్‌ సునీల్‌ గారు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. జులై 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది’’ అన్నారు. నటి జెన్నీఫర్‌ ఇమాన్యుల్‌ మాట్లాడుతూ… ‘‘అందరికి నమస్కారం. విూడియా వారిని మరోసారి కలవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బంధం అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రంలో నటించిన వారితో పనిచేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. జెడి మాస్టర్‌ తో కలిసి పనిచేయడం ప్రత్యేకంగా కనిపించింది’’ అన్నారు. నటుడు శ్రీహాన్‌ మాట్లాడుతూ… ‘‘అందరికి నమస్కారం. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బాలు గారికి, మిత్ర గారికి, రాజా గారికి ధన్యవాదాలు. ఈ సినిమా పూర్తిగా యూత్‌ కు ఎంటర్టైన్మెంట్‌ కోసం చేసింది. ఈ చిత్రంలో ఏది మంచిది ఏది కానిది అనేది ఎన్నో విషయాలు చెప్పాము. ఈ సినిమా చూస్తే పూర్తిగా ఎంటర్టైన్‌ అవుతారు. జూలై 11వ తేదీన తప్పకుండా థియేటర్లో ఈ చిత్రంని చూడండి’’ అన్నారు. చిత్ర దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ… ‘‘సాంగ్‌ లాంచ్‌ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా ధన్యవాదాలు.

 ఈ చిత్రం ఒక మంచి లవ్‌ స్టోరీ తో యూత్‌ ఫుల్‌ గా ఉండబోతుంది. సినిమా చూసినంతసేపు విూ కాలేజీ రోజు గుర్తొస్తాయి. ఈ చిత్రం కోసం నిర్మాత రాజా గారు అలాగే నటీనటులు అందరితో పని చేయడం నాకు ఎంత సంతోషకరంగా కనిపించింది. విూరందరితో కలిసి పనిచేసి మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. నేడు విడుదలైన పాట ప్రేక్షకులందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. జులై 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన స్మరణ్‌ సాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిత్రంలో మంచి బిజీఎం తో పాటు మొత్తం ఆరు పాటలు ఉంటాయి. అలాగే చిత్రం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’’ అన్నారు. నటుడు గీతానంద్‌ మాట్లాడుతూ… ‘‘నేను ఇంతకుముందు చేసిన రథం సినిమాకు కూడా ఇదే నిర్మాత రాజా గారు నిర్మించారు. గత సంవత్సరం గేమ్‌ ఆన్‌ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఇప్పుడు వర్జిన్‌ బాయ్స్‌ చిత్రం ద్వారా మరోసారి విూ ముందుకు రాబోతున్నాను. విడుదలైన ఈ దం దిగ దం పాటలు ఎంతటి పార్టీ మూడ్‌ ఉందో సినిమా అంతా కూడా అలాగే ఉంటుంది. సినిమా చూసి ఎంతో మంచి అనుభూతిని పొందుతారు. యూత్‌ ఈ చిత్రాన్ని ఎంతో బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు. నటి మిత్ర శర్మ మాట్లాడుతూ… ‘‘అందరికి నమస్కారం. ముందుగా ఈ సాంగ్‌ లాంచ్‌ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వర్జిన్‌ బాయ్స్‌ చిత్రం ద్వారా నేను పూర్తిగా నటిగా తృప్తి చెందాను. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరితోను నేను ఎంతో కలిసిమెలిసి పనిచేశాను. దయానంద్‌ ఓ మంచి సోదరుడిలా నా వెంట ఉంటూ దర్శకత్వాన్ని వహించారు. జెడి గారు ఎంత మంచి కొరియోగ్రఫీ అందించారు. చిత్రంలో ముఖ్యంగా డ్యూటీ క్యారెక్టర్‌ ఎంతో ప్రత్యేకమైనది. ఆ క్యారెక్టర్‌ కోసం ఎవరు బాగా చేస్తారో అనుకుంటున్నాప్పుడు మాకు శ్రీహాన్‌ వచ్చారు. ఆయన ఆ క్యారెక్టర్‌ ను ఎంతో బాగా చేశారు. ఈ చిత్రాన్ని నేడు ఇక్కడ వరకు తీసుకువచ్చే ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. అలాగే మమ్మల్ని నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చిన రాజా గారికి ధన్యవాదాలు. ఈ సాంగ్‌ షూటింగ్‌ కూడా ఎంతో బాగా ఎంజాయ్‌ చేసాము. జులై 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము’’ అంటూ ముగించారు.

ఆర్టిస్టులు : గీతానంద్‌, మిత్రా శర్మ, శ్రీహన్‌, రోనీత్‌, జెన్నీఫర్‌, అన్షుల, సుజిత్‌ కుమార్‌, బబ్లు, అభిలాష్‌