అమరావతి – జూన్ 19 : ప్రతిపక్షంలోనూ ఎపి వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అరాచక వైఖరి మారలేదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ..వైసిపి హయాంలోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, నాగమల్లేశ్వరరావు చనిపోయింది గతేడాది జూన్ 9న అని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది గతేడాది జూన్ 12 తేదీన అని చెప్పారు. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య అంటూ వైసిపి దుష్రచారం చేస్తుందని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు.
జగన్ శవరాజకీయాలు చేస్తున్నారు : మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
