LBF News

/ Sep 23, 2025

గ్లెనీగల్స్ హాస్పిటల్‌లో స్ట్రోక్ నివారణకు అధునాతన విధానం

హైదరాబాద్ః హైదరాబాద్‌లోని లక్డికాపూల్ గ్లెనీగల్స్ హాస్పిటల్ వైద్య బృందం, ఎట్రియల్ ఫైబ్రిలేషన్ మరియు బహుళ హార్ట్ క్లాట్స్ కారణంగా స్ట్రోక్ ప్రమాదంలో ఉన్న 65 ఏళ్ల మహిళా రోగిపై, వాచ్‌మన్ పరికరాన్ని ఉపయోగించి లెఫ్ట్ ఎట్రియల్ అపెండేజ్ క్లోజర్ (ఎల్ఏఏసీ) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. కర్ణిక దడ వలన గుండె  ఎడమ కర్ణిక అపెండేజ్‌లో రక్తం గడ్డకట్టే సంభావ్యత పెరుగుతుంది. ఇవి మెదడుకు చేరి స్ట్రోక్‌కి కారణమవచ్చు. అయితే, రోగికి ఇతర ఆరోగ్యసంబంధిత పరిస్థితుల కారణంగా దీర్ఘకాలిక రక్తంను  పలుచగా చేయడానికి వాడే మందులు (బ్లడ్ థిన్నర్స్) ఇవ్వడం సాధ్యం కాలేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే ప్రత్యామ్నాయంగా కార్డియాలజీ బృందం వాచ్‌మన్ పరికరాన్ని ఎంచుకుంది.