కడప : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని గుడి వద్ద జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన కలకలం రేపుతోంది.ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారి సంఖ్య ఇంకా తేలాల్సి ఉంది. స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గువ్వలచెరువు ఘాట్ లో బస్సు ప్రమాదం
