మచిలీపట్నం : మచిలీపట్నం పర్యటనకు వెళ్తున్న నారా లోకేష్ కు నిమ్మకూరులో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము,వర్ల కుమార్ రాజా, తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ స్వగృహం నిమ్మకూరులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తో కలిసి, పుష్పగుచ్చాలు అందిస్తూ లోకేష్ కు ఎమ్మెల్యే రాము స్వాగతం పలికారు. గజ మాలలతో సత్కరించారు. నిమ్మకూరు ఆడపడుచులు మంగళ హారతులిచచారు. అందరూ బాగున్నారా అంటూ నిమ్మకూరు గ్రామస్తులు, టిడిపి శ్రేణులను లోకేష్ కుశల ప్రశ్నలడిగారు. చెయ్యి పట్టుకుంటూ, భుజం తడుతూ ఎమ్మెల్యే రాము, కుమార్ రాజా, నిమ్మకూరు గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించారు. లోకేష్ వెంట ర్యాలీగా మచిలీపట్నం ఎమ్మెల్యేలు తెలుగు తమ్ముళ్లు తరలివెళ్లారు.
గుడివాడ ఎమ్మెల్యే రాముకు మంత్రి లోకేష్ ఆత్మీయ పలకరింపు
