న్యూదిల్లీ: కోకాకోలా ఇండియాలోని ఐకానిక్ మ్యాంగో బ్రాండ్ మాజా, తన నూతన క్యాంపెయిన్ ‘మేరీ ఛోటీ వాలీ జీత్’ను ప్రారంభించింది. ఇది ఒక ఏఐ ఆధారిత డిజిటల్ వేదిక, జనం జీవితంలోని చిన్న కానీ ప్రత్యేకమైన విజయాలను యానిమేటెడ్ కథలుగా మార్చుతుంది. వినియోగదారులు తమ ఫోటోను అప్లోడ్ చేసి, ఓ చిన్న కథను పంచుకోవాల్సి ఉంటుంది. ఓగిల్వీ ఇండియా అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్, అటువంటి చిన్న క్షణాలను మాజా శైలిలో వ్యక్తిగతీకరించిన యానిమేటెడ్ వీడియోలుగా రూపొందించడం ద్వారా రోజువారీ క్షణాలను చిరస్మరణీయ కథలుగా మారుస్తుంది. తరచూ పెద్ద విజయాలకే గౌరవం లభించే ఈ ప్రపంచంలో, మాజా ఒక కొత్త దారిని ఎంచుకుంది. వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసిన చిన్న ఫోటో ఒక కథగా మారుతుంది. గిటార్ మీద కొత్త పాట నేర్చుకోవడం, ఆఫీస్‌లో ప్రశంసలు అందుకోవడం లేదా ఎప్పటినుంచో పెండిరగ్‌లో ఉన్న పనిని చివరికి పూర్తిచేయడం ు ఇవి అన్నీ మామూలు క్షణాలుగా కనిపించినా, వాటికీ ప్రత్యేకత ఉంది.
కోకాకోలా మాజా ‘మేరీ ఛోటీ వాలీ జీత్’ ఉత్సవం
