LBF News

/ Sep 26, 2025

కేంద్రమంత్రితో సీఎం రేవంత్‌ భేటీ

న్యూఢల్లీి : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి ఆర్‌ పాటిల్‌ తో సీఎం రేవంత్‌ రెడ్డి, మంతకరి  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భేటీ ముగిసింది. ఉత్తమ్‌ కుమార్‌ మాట్లాడుతూ  సుదీర్ఘంగా కేంద్ర మంత్రి సిఆర్‌ పాటిల్‌ కి అన్ని అంశాలను వివరించాం తెలంగాణ రైతాంగం ఆందోళనను వివరించాం.  తెలంగాణ కు ఏలాంటి అన్యాయం చేయమని కేంద్ర మంత్రి సిఆర్‌ పాటిల్‌ హావిూనిచ్చారని అన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఇవ్వద్దని కోరాం. అపెక్స్‌ కమిటీ అనుమతులు లేకుండా బనకచర్ల ప్రాజెక్ట్‌ ను ఏపి  చేపట్టే ప్రయత్నం తీవ్ర అభ్యంతరకరం. తెలంగాణ అభ్యంతరాలను కేంద్రం నెమ్మదిగా పరిశీలనలో  తీసుకోవడం, ఏపి ప్రతిపాదనల పై వేగంగా కేంద్రం స్పందించడాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టి కి తెచ్చాం.  తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు న్యాయపోరాటం తో సహా, అన్ని చర్యలు చేపడతామని అన్నారు.