LBF News

/ Sep 26, 2025

కరువు సంక్షోభ నిర్వహణ ప్రణాళికను అమలు చేయాలి

. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

అనంతపురం  : కరువు సంక్షోభ నిర్వహణ ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి. ఐ.ఏ.ఎస్. ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కరువు సంక్షోభ నిర్వహణ జిల్లాస్థాయి కమిటీ సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు కరువు సంక్షోభ నిర్వహణ ప్రణాళికను పక్కాగా తయారు చేసి అమలు అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి కరువు నివారణపై ఇప్పటినుండే ముందస్తు ప్రణాళిక సంబంధిత శాఖ పరిధిలో చర్యలు తీసుకోవాలని, అలాగే వాటిని అమలు చేసే క్రమంలో ప్రతి డాక్యుమెంట్స్ ఫొటోస్ జియో కోఆర్డినేటర్ తో తీసుకోవాలని, వాటిని భద్రపరచాలని ఆదేశించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ఖర్చుల వివరాలు కూడా క్షేత్రస్థాయి అధికారి వద్ద పక్కాగా ఉండాలన్నారు. ప్రతి శాఖ వారు కరువు నివారణ కొరకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.       క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు మెరుగుపడే విధంగా జిల్లా పరిషత్ సీఈవో మరియు జిల్లా పంచాయతీ అధికారి సంయుక్తంగా ప్రతిరోజు ఉదయం పంచాయతీ స్థాయిలో చెత్త సేకరణ మరియు పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని సారించి పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి పనులు ఖచ్చితంగా ఉదయం 6 గంటల నుండి ప్రారంభం కావాలని, ఉపాధి కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకొని పనులు కల్పించాలని, ఫీల్డ్ సిబ్బంది పనితీరుపై ప్రత్యేక నిఘా ఉంచి   పనులు పూర్తి చేయాలని, సక్రమంగా పనిచేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని డ్వామా పి.డి.ని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి యు.ఉమామహేశ్వరమ్మ, జెడ్పి సీఈవో రామసుబ్బయ్య, డ్వామా పి.డి సలీం భాష, సిపిఓ అశోక్ కుమార్, పలువురు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.