. హాజరైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు నాయకులు
కడప (బ్రహ్మంగారిమఠం) : కడప నగరంలోని రామాంజనేయపురంలో నూతన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా సర్వసభ్య సమావేశం మరియు ‘‘రీ కాల్ చంద్రబాబు’’ మేనిఫెస్టో కార్యక్రమం గురువారం వైసీపీ అతిరథ మహారద నాయకుల మధ్య ఘనంగా నిర్వహించబడిరది.ఈ సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి , మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్ భాషా , కడప నగర మేయర్ కె. సురేష్ బాబు , రాజంపేట ,బద్వేల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , దాసరి సుధా , ఎమ్మెల్సీలు డి.సి. గోవింద్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, రామసుబ్బారెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు రఘురాం రెడ్డి, రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కూడా పాల్గొన్నారు.ఇందులో భాగంగా పార్టీ నాయకులుకు,కార్యకర్తలకు, అభిమానులకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రజల్లో చైతన్యం పరచాలని మరియు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హావిూలు ఎంత మేర నెరవేర్చారు ప్రజలకు అడిగి తెలుసుకోవాలన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమవుతున్న ఏ ఒక్క పథకం అమలు చేయకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన సానుభూతి పరుల పైన అక్రమ కేసులు అమలు చేయడంలో ముందుందని అన్నారు.కడప పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్ రెడ్డి , కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, కో ఆప్షన్ మెంబర్లు, వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.