మంచిర్యాల : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలయ్యి ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ లోని జయశంకర్ కాలనీకి చెందిన అక్షయ్ అనే విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్ గణితం సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దాస్ తండాకు చెందిన గుగులోత్ హారిక (17) ఇంటర్ మొదటి సంవత్సరంలో బాటనీ పరీక్ష ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ రాయగా అందులోనూ ఫెయిల్ అయింది. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మహాబత్ పూర్ గ్రామానికి చెందిన వెంకటరమణ (18) కుడా ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి అందులో ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. ముగ్గురూ మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలయ్యి ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య
